Saturday, January 18, 2025
HomeTrending Newsప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: సిఎం జగన్

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: సిఎం జగన్

CM Jagan Thanked The People Of Badvel For Their Mandate In Favour Of Ysrcp :

బద్వేల్ ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం పట్ల సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను” అని వెల్లడించారు.

అంతకుముందు, సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు కలుసుకున్నారు. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధ, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ నేతలను జగన్ అభినందించారు.

Must Read :బద్వేల్ లో వైసీపీకి భారీ మెజార్టీ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్