Friday, April 19, 2024
HomeTrending Newsఏపీ వాల్టా చట్టంలో మార్పులు: పెద్దిరెడ్డి

ఏపీ వాల్టా చట్టంలో మార్పులు: పెద్దిరెడ్డి

Necessary Changes In Ap Walta Act By Center Guidelines Says Minister Peddireddy:

ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి అధికారులను ఆదేశించారు. వాల్టా చట్టంపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సిఇడబ్ల్యుఎ) నిబంధనల అమలుపై చర్చించారు.  సిఇడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపును పరిశీలించాలని సూచించారు.

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఈ చార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  భూగర్భ జలాలను వినియోగించే చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్దేశించారు.  జాతీయ స్థాయిలో భూగర్భ జలాల వినియోగంపై కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వాల్టా చట్టంలో కూడా అవసరమైన మార్పులు తీసుకురావాలని కోరారు.

తాగునీటి అవసరాలు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాల విషయంలో ఎటువంటి చార్జీలను విధించకూడదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో భూగర్భజలాలు అడుగంటిపోకుండా, వాటిని సరైన స్థాయిలో వినియోగించేందుకు కేంద్రం రూపొందించిన నిబంధనల అమలుపై అధికారులు అధ్యయనం చేసి తగిన మార్పులు చేసుకోవాలన్నారు.  ఈ సమావేశంలో పిఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలరావు,  పిఆర్‌&ఆర్డీ కమిషనర్ కోనా శశిధర్, డిఎంజి విజి వెంకటరెడ్డి, వాటర్ షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Must Read :తమిళనాడు బాణసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్