Saturday, March 14, 2026
HomeTrending Newsనేడు వైఎస్సార్ కాపు నేస్తం

నేడు వైఎస్సార్ కాపు నేస్తం

వైఎస్సార్‌ కాపు నేస్తం రెండో ఏడాది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అమలు చేస్తోంది. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సాయం జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం అందనుంది.

  • పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ
  • మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం
  • ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమలు
  • వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం
  • ఈ పథకం ద్వారా గత ఏడాది 3,27,349 మంది ఖాతాల్లో రూ. 491.02 కోట్లు జమ,
  • నేడు 3,27,244 మందికి అందిస్తున్న రూ.490.86 కోట్లతో కలిసి మొత్తం రూ. 981.88 కోట్ల లబ్ధి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular