Monday, January 20, 2025
HomeTrending Newsవైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ విడుదల

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన పథకం కింద నేడు ఆర్ధిక సాయాన్ని రైతుల అకౌంట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జమ చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 3 ఏళ్ళు రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం అందించిన ప్రభుత్వం ఈ నాలుగో ఏడాది కూడా ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 11,500 చొప్పున సాయం జమ చేసింది. నేడు మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 1090.76 కోట్లను గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో వేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.  ఇప్పుడు అందిస్తున్న సాయం 1,090.76 కోట్లతో కలిపి ఈ మూడున్నరేళ్ళలో జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం మాత్రమే 27,062.09 కోట్ల రూపాయలు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి ఊతం అందించేందుకు ఈ మూడేళ్ళ తొమ్మిది నెలల్లో రైతన్నలకు ప్రభుత్వం అందించిన సాయం రూ. 1,45,751 కోట్లుగా వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్