Friday, November 22, 2024
HomeTrending NewsYSRCP Bus Yatra: శ్రీకాకుళానికి బాబు చేసిందేమీ లేదు: ధర్మాన

YSRCP Bus Yatra: శ్రీకాకుళానికి బాబు చేసిందేమీ లేదు: ధర్మాన

ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఈనెల 23న సిఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. గతంలో కిడ్నీ రోగులు ఉన్నారంటే వచ్చి చూసి వెళ్లే వారని… సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని, కానీ వైసీపీ మాత్రం సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చూపించిందని, కిడ్నీ రోగులకు స్వచ్ఛమైన నీరును అందించే ప్రాజెక్టును కూడా జగన్ చేపట్టారని అన్నారు.

ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సుయాత్ర జనహోరుతో ప్రతిధ్వనించింది. పలాసలో అడుగిడిన బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. పలాస- కాశీబుగ్గ జంక్షన్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, బాబూ జగజ్జీవన్ రామ్, స్వర్గీయ వైఎస్సార్ విగ్రహాలకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణ దాస్, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం  బహిరంగసభకు హాజరైన జనసంద్రాన్ని ఉద్దేశించి నేతలు ప్రసంగించారు.

సీనియర్ మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఐదున్నర సంవత్సరాల క్రితం మీ ముందుకు వచ్చి టీడీపీ దోపిడీని, అక్రమాలను వివరించామని, నాలుగున్నరేళ్లలో మా ప్రభుత్వం చేసిన ముఖ్యమైన అభివృద్ధి పనులను, సంక్షేమాన్ని జ్జాపకం చేయడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చామని ప్రజలనుద్దేశించి అన్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాల్సిన అవసరం గతంలో వచ్చేదని, అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పరిపాలన సాగుతోందన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ తమ ప్రభుత్వం మీద ఆరోపణ చేయలేకపోయారంటే పాలన ఎంత పారదర్శకంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పరిపాలనలో చాలా మార్పులను జగన్ తీసుకువచ్చారని వివరించారు.

తాను అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బు సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని రాజమండ్రి సభలో చంద్రబాబు చెప్పారని, ప్రజల కోసం బాబు ఏనాడూ ఆలోచన చేయలేదనడానికి ఆ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవిధంగా చంద్రబాబు ఏ రోజునా ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ఓట్ల కోసమో, ప్రజల కోసమో కాదని, పేద ప్రజల జీవితాలను మార్చడానికే సీఎం జగన్ పలు విప్లవాత్మక నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారన్నారు. జగన్ పాలననలో లెఫ్ట్ పార్టీల పోరాటాలు కూడా లేవంటే ఏ స్థాయిలో సంక్షేమ పాలన సాగుతుందో చెప్పవచ్చునని వివరించారు. దేశంలోనే ఇదో చారిత్రాత్మక పాలనగా అభివర్ణించారు.

స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ పేదలు సాయం కోసం చేయి చాపకుండా తలెత్తి ధైర్యంగా బ్రతకగలిగే ధైర్యాన్ని సిఎం జగన్ కల్పిస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీలతో ప్రతీ కుటుంబంలో వెలుగులు నిండుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు మామలు ఉన్నారని… ఒకరు చందమామ, మరొకరు జగన్ మామ అని స్కూలు విద్యార్థులు గొప్పగా అభివర్ణించుకుంటున్నారని అన్నారు.  ప్రతీ కుటుంబంలో సంస్కారవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఇచ్చేది చదువు మాత్రమేనని జగన్ భావిస్తుంటారని పేదవాడు విజయపతాకం ఎగురవేయాలన్నదే ఆయన సంకల్పమని ఉద్ఘాటించారు. ప్రత్యామ్మాయం ఆలోచన చేయకుండా జగన్ ను మళ్లీ సీఎం చేయాలని తమ్మినేని  పిలుపునిచ్చారు. జగన్ ను మళ్లీ సీఎం చేసుకోకపోతే దేవుడు కూడా క్షమించడన్న విషయాన్ని గుర్తించాలని,  పెత్తందారి వర్గాలకు ధీటుగా సామాజిక సాధికారతను సీఎం జగన్ తీసుకువెళ్తున్నారన్నారు

స్థానిక ఎమ్మెల్యే, పంశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, రాష్ట్రం అవతరించి 65 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా అనేక వెనుకబడిన వర్గాలు సాామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని, అన్నివర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కావాలని సీఎం జగన్ సంకల్పించారన్నారు. జగన్ సీఎం అయ్యాక ఏ కుటంబమైనా సరే పిల్లల చదవుల కోసం ఒక్క రూాపాయైనా సరే అప్పులు చేశారా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులపై పిల్లల చదువుల భారం పడకుండా అమ్మఒడితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన చేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ తీసుకువచ్చారన్నారు.  చంద్రబాబు ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా చేసినా సరే పాఠశాలల్లో కనీస వసతులు కల్పిచాలన్న ఆలోచన ఏనాడూ రాలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే చంద్రబాబుకు చాలా చుకలనని, వివిధ సందర్భాల్లో అవమానించారని ధ్వజమెత్తారు. మత్స్యకారులను ఓ సందర్భంలో అవమానిస్తే చంద్రబాబుకు తమ దెబ్బ అంటే ఏంటో మత్స్యకారులు ఇచ్చాపురం నుంచి గుంటూరు వరకు చూపించి 23 స్థానాలకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్