Sunday, January 19, 2025
HomeTrending Newsవరద కష్టాలు దూరం: అంబటి

వరద కష్టాలు దూరం: అంబటి

Sangam Barrage: పెన్నా, సంగం బ్యారేజీలను సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి  అంబటి రాంబాబు వెల్లడించారు. వీటి నిర్మాణంతో వరద కష్టాలు దూరమవుతాయని అయన భరోసా ఇచ్చారు.   సంగం బ్యారేజీ నిర్మాణ పనులను  వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి  జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పెన్నా, సంగం బ్యారేజీ పనులు 90శాతం పూర్తయ్యాయని, జగన్ సిఎం అయ్యాక పనులు వేగవంతం అయ్యాయని మంత్రి కాకాణి చెప్పారు. నెల్లూరు జిల్లా ప్రజల కలల్ని జగన్ సాకారం చేస్తున్నారన్నారు.

Also Read :  సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్