Monday, June 15, 2026
HomeTrending NewsCM Jagan: వర్సిటీ విద్యార్థులతో సిఎం ముఖాముఖి

CM Jagan: వర్సిటీ విద్యార్థులతో సిఎం ముఖాముఖి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి విశాఖపట్నంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. కే రహేజా గ్రూప్ విశాఖలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు భూమి పూజ చేయడంతో పాటు హలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టుమన్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకొని, ముందుగా కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు, అనంతరం అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఎలిమెంట్‌ ఫార్మా ఇంక్యుబేషన్‌ సెంటర్, బయో మానిటరింగ్‌ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు.  అక్కడి నుంచి బయలుదేరి బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్‌ అవుతారు. కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular