Monday, February 24, 2025
HomeTrending NewsYS Jagan: నేడు సిఎం జగన్ విశాఖ పర్యటన

YS Jagan: నేడు సిఎం జగన్ విశాఖ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్‌ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొంటారు, అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్