Sunday, June 14, 2026
HomeTrending Newsరేపు ఢిల్లీకి సిఎం జగన్: ప్రధానితో భేటి

రేపు ఢిల్లీకి సిఎం జగన్: ప్రధానితో భేటి

CM Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం సమావేశం కానున్నారు, సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బిజెపి రాష్ట్ర నాయకులకు చేసిన దిశా నిర్దేశం, రాజధాని ఉద్యమంలో బిజెపి నేతలు పాల్గొనడం, ఇటీవల విజయవాడలో జరిగిన ప్రజా ఆగ్రహ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై బిజేపు నేతలు చేసిన విమర్శల నేపథ్యంలో సిఎం ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

విభజన హామీలు, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular