Thursday, September 19, 2024
HomeTrending Newsసాయంత్రం వైజాగ్ లో సిఎం జగన్ టూర్

సాయంత్రం వైజాగ్ లో సిఎం జగన్ టూర్

CM – Vizag Tour:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ ల ప్రారంభోత్సవంతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనువరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

⦿ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం

⦿ 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌ల ప్రారంభం

⦿ 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరు

⦿ 6.20 గంటలకు ఉడా పార్క్‌ వద్ద ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌ల ప్రారంభం

⦿ సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనువరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరు

⦿ అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్