7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending Newsజగన్ హత్యకు కుట్ర: ప్రకాష్ రెడ్డి

జగన్ హత్యకు కుట్ర: ప్రకాష్ రెడ్డి

Babu for Power only:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గాల్లో కలిసి పోతాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధికారం లేకుండా చంద్రబాబు ఉండలేరని, అందుకే ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే జగన్ ను హత్య చేసి అయినా అధికారంలోకి రావాలని బాబు అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హింసా రాజకీయాలకు, స్కాములకు తెలుగుదేశం పార్టీ కేరాఫ్ అడ్రస్ అని అభివర్ణించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 242 కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు మళ్ళించారని, బాబు పాలనలో వేల కోట రూపాయల ప్రజాధనం దోచుకున్నారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు.

కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలను చంపితే 50 లక్షల రూపాయలు సుపారీ ఇస్తానని మల్లాది వాసు అనే వ్యక్తి బహిరంగంగా ప్రకటన ఇచ్చారని, దీన్ని చంద్రబాబు కానీ, బాలకృష్ణ కానీ కనీసం ఖండించలేదని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. మా పార్టీ నేతలను చంపుతామంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని అయన ప్రశ్నించారు. వల్లభనేని వంశీని తాము పార్టీలో చేర్చుకోలేదని, సైకిల్ గుర్తుపై గెలిచిన ఏ ఒక్కరినీ తాము చేర్చుకోలేదని అయన స్పష్టం చేశారు .

RELATED ARTICLES

Most Popular

న్యూస్