Saturday, June 13, 2026
HomeTrending Newsటూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ ఆవిష్కరణ

టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ ఆవిష్కరణ

మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో  ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023  జరగనున్న నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించింది. సిఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్‌ బాషల్లో రూపిందించిన ఈ పుస్తకాలు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో  ఉంచనున్నారు. ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూ, ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు ఉన్నాయి.

బెస్ట్‌ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ టూరిజం శాఖను సిఎం అభినందించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని అధికారులు  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని సిఎం జగన్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవెన్, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మ విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular