Monday, June 15, 2026
HomeTrending NewsYS Jagan: గ్లోబల్ సదస్సు ఒప్పందాలు కార్యరూపం: సిఎం

YS Jagan: గ్లోబల్ సదస్సు ఒప్పందాలు కార్యరూపం: సిఎం

రాష్ట్రంలోని మూడు జిలాల్లో 1425 కోట్ల రూపాయల పెట్టుబడితో  మూడు పరిశ్రమలకు శంఖుస్థాపన చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వీటివల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.   క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన  చేసిన సిఎం…  గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించారు. ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి. చాలా సంతోషకరమైన సందర్భమిది’ అని సిఎం వ్యాఖ్యానించారు.

శంఖుస్థాపన చేసిన పరిశ్రమల వివరాలు:

1) నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్‌ తయారీని చేపడుతున్న క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
రూ.610 కోట్ల పెట్టుబడి, 1000మందికి ఉద్యోగాలు. రోజుకు 500 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ తయారీ.
ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 4వేల టన్నుల డ్రైడ్‌ డిస్టిలరీ గ్రెయిన్స్‌.

2) నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో ఇథనాల్‌ తయారీ కర్మాగారాన్ని పెడుతున్న విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్‌.
రూ.315 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. రోజుకు 200 కిలోలీటర్ల బయోఇథనాల్‌ తయారీ.
విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి బయో ఇథనాల్‌ తయారీ.
వరిని సాగుచేస్తున్న రైతులకు అత్యంత ఉపయోగకరం.
అలాగే మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టలరీ తయారీ. బై ప్రొడక్ట్‌గా డ్రైడ్‌ డిస్టిలరీస్‌ గ్రెయిన్స్‌.

3) తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్‌ కాఫీ లిమిటెడ్‌ పుడ్‌, బెవెరేజెస్‌ కంపెనీ.
రూ.400 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు. సంవత్సరానికి 16వేల టన్నుల సొల్యుబుల్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ ప్లాంట్‌.

ప్రారంభించిన పరిశ్రమ:

ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ కంపెనీ.
రూ.100 కోట్ల పెట్టుబడి, 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు. రోజూ 400 టన్నుల ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ.
దీంతోపాటు రోజుకు 200 టన్నుల సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ యూనిట్‌.

ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మావతి, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, ఆయా కంపెనీల ప్రతినిధులు,  పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular