2.6 C
New York
Thursday, November 30, 2023

Buy now

Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అత్యంత సంతృప్తి నిచ్చింది : సిఎం జగన్

అత్యంత సంతృప్తి నిచ్చింది : సిఎం జగన్

ఇప్పటివరకు తాము చేపట్టిన పథకాలు, కార్యక్రమాల్లో ఇళ్ళ నిర్మాణం అత్యధిక సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా దాదాపు 31 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాల ద్వారా స్థిరాస్తి ఇవ్వడమే కాకుండా, ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నామని తెలిపారు.

‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో తొలి విడతలో నిర్మించనున్న 15 లక్షల 60 వేల ఇళ్ళకు క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణం చెప్తారు. అన్ని కాలనీలలో రూ.32,909 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పించనున్నారు. ఈనెల 10 వరకు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ఇళ్ల నిర్మాణ ప్రారంభ మహోత్సవం ఒక పండగ వాతావరణంలో జరుగనుంది.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఎక్కడా ఉండకూడదనే లక్ష్యంతోనే అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇల్లు కట్టించి ఇస్తున్నామని, పేదవారి సొంతింటి కలను నిజం చేస్తున్నామని వెల్లడించారు.

అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోతే, సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని, అన్నీ పరిశీలించి తప్పనిసరిగా 90 రోజుల్లో మంజూరు చేస్తామని సిఎం హామీ ఇచ్చారు. ‘ప్రతి చెల్లెమ్మకు జగన్‌ అన్న తోడుగా ఉన్నాడు. అలాగే ప్రతి అక్కకు ఒక తమ్ముడిగా తోడుగా ఉన్నాడు’ అని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు సమర్ధంగా అమలు చేయడానికి ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లను నియమించామని, అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఇళ్ళ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మరో జాయింట్ కలెక్టర్ ను నియమిస్తున్నామని ప్రకటించారు. రేపటి నుంచే జేసీలు అందుబాటులో ఉంటారని, వారు ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తారని సిఎం జగన్ వివరించారు

ఇళ్ళ స్థలాలపై కొందరు దుర్భుద్దితో కోర్టుల్లో కేసులు వేసినందున 3.74 లక్షల అక్క చెల్లెమ్మలకు దురదృష్టవశాత్తూ ఇవాళ న్యాయం చేయలేకపోతున్నామని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల్లో కేసులు పరిష్కారం కాగానే తప్పకుండా వారికి ఇల్లు స్తామని హామీ ఇచ్చారు. ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ కార్యక్రమం ద్వారా దేవుడి దయతో మంచి జరగాలని సిఎం ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్