Friday, November 22, 2024
HomeTrending Newsవైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన

వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త చరిత్రకు నేడు నాంది పడుతోంది. ఒకే రోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా శంఖుస్థాపన చేయనున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 11 వైద్య కళాశాలలు, రెండు డెంటల్‌ కాలేజీలతో పాటు, 10 నర్సింగ్‌ కళాశాలలు ఉండగా, కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల్లో ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు మొదలు కాగా, సోమవారం నాడు 14 వైద్య విద్యా ఆస్పత్రుల పనులకు ముఖ్యమంత్రి జగన్‌  శ్రీకారం చుట్టనున్నారు.

విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, అదోని, నంద్యాలలో దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వీటి ద్వారా కొత్తగా 1850 సీట్లతో పాటు, 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్టు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల పనులు మొదలు పెట్టినుందువల్ల, మిగిలిన 14 వైద్య కళాశాలల పనులకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ శిలా ఫలకాలు ఆవిష్కరిస్తారు. 2023 చివరి నాటికి ఈ కళాశాలల నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

ప్రతి మెడికల్‌ కాలేజీలోనూ 500 పడకలు తగ్గకుండా ప్రత్యేక సర్వీసులతో కూడిన ఏర్పాట్లు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాగ్నోస్టిక్‌ సర్వీసులు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.  ఆక్సిజన్‌ స్టోరేజి ట్యాంకులతో పాటు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు కూడా నిర్మించనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్