0.1 C
New York
Thursday, December 7, 2023

Buy now

Homeసినిమాఊర్వశి ‘ఓటిటి' అందిస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్

ఊర్వశి ‘ఓటిటి’ అందిస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్

ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన కానుకగా.. మహేష్ బాబు తమ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈ సంవత్సరం కరోనా కలకలం దృష్ట్యా…  ‘సర్కారు వారి పాట’ నించి కూడా ఏవిధమైన అప్డేట్ రావడం లేదు. అందుకే సూపర్ స్టార్ ఫాన్స్ ని ఉత్తేజపరిచేలా.. అల్లూరి సీతారామరాజుగా కనిపించి మైమరపించిన డేరింగ్ & డాషింగ్ హీరో కృష్ణ గారికి జన్మదిన కానుకగా ఆర్.పి పట్నాయక్ పాడిన విప్లవ వీరుని గీతం.. సూపర్ స్టార్ అభిమానులకు అంకితమిస్తూ ఊర్వశి ఓటిటి వారు విడుదల చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీరు.కె ఈ పాట రూపకల్పనకు సారధ్యం వహించగా ఆర్.పితో యువ గాయనీమణి మౌనిక గొంతు కలిపారు.

ఊర్వశి ఓటిటి ఎమ్.డి రవి కనగాల- సిఇఓ రామసత్యనారాయణ మాట్లాడుతూ… “తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన సూపర్ స్టార్ కృష్ణగారిపై ఓ పాటను ఆయనకు కానుకగా, ఆయన అభిమానులకు అంకితం చేస్తూ విడుదల చేస్తుండడం మాకు ఎంతో గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశం కల్పించిన ‘మా’ అధ్యక్షులు నరేష్ గారికి మా కృతజ్ఞతలు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్