Friday, March 20, 2026
HomeTrending Newsతిరుపతి వరద బాధితులకు సిఎం ఓదార్పు

తిరుపతి వరద బాధితులకు సిఎం ఓదార్పు

CM Visit:
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండో రోజు  తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో వరద బాధితులను పరామర్శించారు. ఇళ్లు కూలిపోయిన ప్రదేశాలను సిఎం పరిశీలించారు. బాధితుల వద్దకు వెళ్లి వారు చెప్పిన విషయాలు సావధానంగా ఆలకించారు. పలువురు బాధిత మహిళలు సిఎం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వేడుకున్నారు.  భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురు కూకుండా ఉండేందుకు ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టాలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సిఎం వెంట పర్యటనలో తిరుపతి మేయర్ డా. శిరీష, డిప్యుటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉన్నారు.

Also Read : వరద బాధితులకు సిఎం జగన్ భరోసా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular