Tuesday, June 9, 2026
Homeసినిమా‘అతడు ఆమె ప్రియుడు’ టీజర్ ఆవిష్కరించిన మంత్రి అవంతి

‘అతడు ఆమె ప్రియుడు’ టీజర్ ఆవిష్కరించిన మంత్రి అవంతి

Athadu-Ame-Priyudu:
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం వైజాగ్ అవంతి కాలేజీలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

అవంతి సంస్థల అధినేత, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై టీజర్ ఆవిష్కరించి ‘అతడు ఆమె ప్రియుడు’ అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని ఈ సందర్భంగా యండమూరి పేర్కొన్నారు.

ప్రఖ్యాత దర్శకులు కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన “అతడు ఆమె ప్రియుడు” ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన లభించిందని, మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు రిలీజ్ చేసిన టీజర్ కు ఖ‌చ్చితంగా మరింత మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు రవి కనగాల-తుమ్మలపల్లి రామ్ పేర్కొన్నారు.

Also Read : ‘రుద్రం కోట’  టైటిల్ లాంచ్ చేసిన మోహన్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular