Sunday, January 19, 2025
HomeTrending Newsలంక గ్రామాల్లో సిఎం జగన్ టూర్

లంక గ్రామాల్లో సిఎం జగన్ టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటన మొదటి రోజు పూర్తయ్యింది. పి.గన్నవరం మండలం జి.పెదపూడి,  పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అరిగెలవారిపేట, ఉడిమూడిలంక వాడ్రేవుపల్లి లో పర్యటించారు.  రాజోలు మండలం మేకలపాలెం బాధితులను కలుసుకుని వారికి అందిన సాయంపై ఆరా తీశారు.

కాగా,  తన భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడని, జీవనోపాధి చూపాలంటూ జి.పెదపూడి లంకకు చెందిన జ్యోతి సీఎంకు తన ఆవేదన చెప్పుకుంది. వెంటనే వాలంటీర్‌గా నియమించాలంటూ సీఎం ఆదేశించారు. సీఎం ఆ గ్రామ పర్యటనలో ఉండగానే నియామక ఉత్తర్వులు తయారు చేసిన అధికారులు సిఎం చేతుల మీదుగా దాన్ని ఆమెకు అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్