Penna-Sangam: పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయని, ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఇళ్ళు తొలగించకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణపనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మే నెలలో మంచి ముహూర్తం చూసి సంగం, పెన్నా ప్రాజెక్టులను సిఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అనిల్ కుమార్ ప్రకటించారు. సంగం బ్యారేజ్ కి గౌతం రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామని, రెండు బ్యారేజ్ లు ప్రారంభమైతే సాగు ,తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అయన వివరించారు.
ఇవి కూడా చదవండి : సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం