Wednesday, March 18, 2026
HomeTrending Newsమన ప్రయాణం ఇలాగే కొనసాగాలి : సిఎం జగన్

మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి : సిఎం జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 12 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ ఏట సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు, రాష్ట్ర ప్రజలందరికీ జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

‘‘గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular