Sunday, February 23, 2025
HomeTrending Newsఅభివృద్ధి, సంక్షేమం వైపు...: సిఎం

అభివృద్ధి, సంక్షేమం వైపు…: సిఎం

CM Jagan Wish The People Of Ap On Its Formation Day Celebrations :

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారితో పాటు ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిందని, ఈ పోరాట స్ఫూర్తి ఎప్పటికీ మనతోనే ఉంటుందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అకుంఠిత దీక్ష, చిత్తశుద్ధి, అంకితభావంతో కొనసాగిస్తామని సిఎం స్పష్టం చేశారు.

తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో సిఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని అవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

Must Read :నవంబరు 1న వైఎస్సార్ అవార్డుల ప్రధానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్