Wednesday, March 11, 2026
Homeస్పోర్ట్స్ఒలింపిక్స్ ఆటగాళ్లకు సిఎం విషెస్

ఒలింపిక్స్ ఆటగాళ్లకు సిఎం విషెస్

టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఆటగాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో విశ్వ క్రీడా సంబరాలు జరగనున్నాయి.  రాష్ట్రం నుంచి ఈ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలు ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  చిత్తూరు జిల్లాకు చెడిన రజనీ (ఉమెన్స్‌ హకీ) బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికీ 5లక్షల రూపాయల చెక్ ను సిఎం జగన్ వారికి అందజేశారు.

విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు ముఖ్యమంత్రి.  ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్‌ ఉద్యోగులు వెంకట రమణ, జూన్‌ గ్యాలియో, రామకృష్ణ కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular