Friday, June 12, 2026
HomeTrending Newsసిఎం జగన్‌ రాఖీ శుభాకాంక్షలు

సిఎం జగన్‌ రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు… ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. రక్షాబంధనం అన్నది ఆత్మీయతలూ అనురాగాల పండుగ అని…  ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా… మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular