Sunday, February 23, 2025
HomeTrending Newsజార్ఖండ్ పర్యటనకు కెసిఆర్

జార్ఖండ్ పర్యటనకు కెసిఆర్

చైనా సరిహద్దులోనీ గల్వాన వాలీ లో జరిగిన హింసాత్మక ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఝార్ఖండ్ పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు ఈ రోజు (శుక్రవారం) ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసం లో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు.

చైనా తో జరిగిన ఘర్షణ లో మన రాష్ట్రానికే చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆడుకున్న సంగతి తెలిసిందే. అదే సందర్భంగా అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసిఆర్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో..ఇచ్చిన మాట ప్రకారం.. ఢిల్లీ నుంచి ఈ రోజు (శుక్రవారం) సీఎం కేసిఆర్ ఝార్ఖండ్ కు బయలు దేరి ఝార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలను ఆర్థిక సాయం అందించనున్నారు.
కాగా ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం,మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసిఆర్ పర్యటన చేపట్టనున్నారు.

Also Read : కేసీఆర్‌తో సుబ్రమణ్యస్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్