Saturday, April 20, 2024
HomeTrending Newsసైబర్ క్రైమ్ అంతు చూడాలి - సిఎం కెసిఆర్

సైబర్ క్రైమ్ అంతు చూడాలి – సిఎం కెసిఆర్

సంక‌ల్పంతో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నిర్మించామని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బంజారాహిల్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య‌వ‌స్థ రావాల‌ని చెప్తూ వ‌చ్చాను. అది నెర‌వేరింది. మ‌రో చిన్న కోరిక ఉంది. సంస్కార‌వంత‌మైన పోలీసు వ్య‌వ‌స్థ నిర్మాణం కావాలి. దేవానికే ఆద‌ర్శంగా నిల‌వాలి. ఎంత చ‌దువుకున్నా సంస్కారం లేక‌పోతే కష్టమన్నారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రం అశాంతికి లోనుకాకుండా శాంతిభద్రతల నిలయంగా ముందుకు సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో చాలా నేరాలు తగ్గాయని చెప్పుకొచ్చారు. కమాండ్ కంట్రోల్ సపోర్ట్తో పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం వుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

పోలీసులకు ఎటువంటి సహకారం కావాలన్న అందిస్తానని వెల్లడించారు. నేరగాళ్లు రూపాలు మారుస్తున్నారన్న సీఎం.. ప్రపంచాన్ని గందరగోళ పరుస్తోన్న అంశం సైబర్ క్రైం అని చెప్పారు. సైబర్ క్రైం ఒక క్రిటికల్ అంశమని..డీజీ లేదా అడీషనల్ డీజీని పెట్టి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. విదేశాల్లో సైబర్ క్రైమ్ పై ఎటువంటి విధానం ఉందో తెలుసుకోవాలని సూచించారు. భవనాన్ని నిర్మించిన రోడ్లు భవనాలశాఖ మంత్రికి, ఆర్అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ గణపతిరెడ్డి, షాపూర్‌జీ నిర్మాణ సంస్థ, టెక్నాలజీని సమకూర్చిన కంపెనీ.. భవన నిర్మాణానికి ప్రతిచేసిన ప్రతి కార్మికుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా అన్నారు.

హైద‌రాబాద్‌లో ఇంత మంచి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ వ‌స్త‌ద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. సంక‌ల్పంతో దీన్ని నిర్మించాం. ఈ ఫ‌లితం మ‌న కండ్ల ముందు నిల‌బ‌డి నిలువెత్తు సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు దాని ముందు మాట్లాడుతున్నాం. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ సంక‌ల్ప బ‌లానికి ప్ర‌తీక‌. చిత్త‌శుద్ధితో చాలా చేశాం. గుడుంబా నిర్మూలన కోసం అనేక చ‌ర్య‌లు తీసుకున్నాం. పేకాట క్ల‌బ్బుల‌ను మూసివేశాం. గ‌తంలో పేట‌కో క్ల‌బ్ ఉండేది. రాబోయే రోజుల్లో పోలీసులు మ‌రింత చురుకుగా ప‌ని చేయాలి. మంచిని సాధించ‌డానికి మంచి సంక‌ల్పంతో ప‌ని చేస్తే స‌త్ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు.

Also Read : కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్