Sunday, June 14, 2026
HomeTrending NewsSaichand: గాయకుడు సాయిచంద్ కు సీఎం కేసీఆర్ నివాళి

Saichand: గాయకుడు సాయిచంద్ కు సీఎం కేసీఆర్ నివాళి

అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్ సాయి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను చూడగానే ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా…” సార్ సాయిని పిలువండి. లెమనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్..” అంటూ హృదయ విదారకంగా రోదిస్తున్న సాయిచంద్ భార్య రజనీని ఓదార్చడం సిఎం కు కష్టంగా మారింది. దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సీఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు ,మెహమూద్ అలీ సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ లు గోరేటి వెంకన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మధుసూదనాచారి తదితర ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు సీఎం కేసీఆర్ వెంట వచ్చి నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular