CM slams Criticism:
కొందరు నేతలు రాజకీయంగా అనేక మాటలు మాట్లాడతారని, విమర్శలు చేస్తారని వాటితో మీ స్ధైర్యాన్ని కోల్పోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బాధితులకు అందించాల్సిన సహాయం పట్ల సంకల్పాన్ని సడలనీయవద్దని వారికి హితవు పలికారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం చేపడుతున్న సహాయ కార్యక్రమాలను సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం సమీక్షించారు. వరద పీడిత జిల్లాలైన ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు ప్రస్తావనకు వచ్చాయి, దీనిపై జగన్ స్పందిస్తూ అధికారులు ఎవ్వరూ ఇలాంటి విమర్శలను పట్టించుకోవద్దని కోరారు.
ఈ సందర్భంగా సిఎం చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు:
⦿ గతంలో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదికలను పట్టించుకోలేదు
⦿ చెయ్యేరు ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వచ్చింది
⦿ పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నీటి విడుదల సామర్థ్యానికి మించి వరదనీరు వచ్చింది
⦿ అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేయాలి
⦿ కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయగలదు, అప్పుడు అలానే డిజైన్ చేశారు
⦿ కానీ దురదృష్టవశాత్తూ 3.2 లక్షల క్యూసెక్కులనీరు వచ్చింది
⦿ 2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారు
⦿ ఇవాళ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న నాయకులు అప్పుడు పట్టించుకోలేదు
అంటూ సిఎం వ్యాఖ్యలు చేశారు.
నిత్యవసరాల పంపిణీ, వరదబాధిత కుటుంబాలకు అదనంగా రూ.2వేల పంపిణీ, సహాయ శిబిరాలు, విద్యుత్తు–తాగునీటి సరఫరా పునరుద్ధరణ, వైద్య–ఆరోగ్య శిబిరాలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, గల్లైంతన వ్యక్తుల ఆచూకీ, పశుదాణా పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. అంశాల వారీగా వరద నష్టం నివేదికలను, సహాయ చర్యల్లో ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Also Read : తక్షణ వరద సాయం : సిఎం విజ్ఞప్తి