Thursday, March 28, 2024
Homeసినిమాడిసెంబర్ 10న నాగ శౌర్య ‘లక్ష్య’

డిసెంబర్ 10న నాగ శౌర్య ‘లక్ష్య’

Lakshya Coming:
యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌ గా రాబోతోన్న 20వ చిత్రం ‘లక్ష్య’ విడుదల తేదీని ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 10న విడుదల కానుంది. ‘వరుడు కావలెను’ సక్సెస్ తరువాత నాగ శౌర్య ‘లక్ష్య’ చిత్రం రాబోతుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్క వర్షం కూడా పడుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా పెంచేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో రెండు విభిన్నమైన గెటప్స్‌ లో కనిపిస్తారు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రేక్షకులను అలరించబోతున్నారు. కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్