Friday, March 20, 2026
HomeTrending Newsకొత్త జిల్లాల ఏర్పాటులో అయోమయం వద్దు: సిఎం

కొత్త జిల్లాల ఏర్పాటులో అయోమయం వద్దు: సిఎం

Be ready: వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలని, కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లా కేంద్రాల నుంచి పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తించాలని సూచించారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

⦿ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి
⦿ కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలి
⦿ దీనికోసం ఏర్పాట్లను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలి
⦿ కొత్త జిల్లాల్లో భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలి, అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలి
⦿ జిల్లాల ఏర్పాటులో అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి
⦿ నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం అన్నది చాలా ముఖ్యం,  దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
⦿ ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలి
⦿ పరిపాలన సాఫీగా సాగడానికి వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుంది
⦿ వీరు కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు సన్నాహాలు పరిశీలిస్తారు

సిఎంకు అధికారులు అందించిన వివరాలు:

⦿ కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు వివరించిన అధికారులు.
⦿ కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించిన అధికారులు.
⦿ అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామన్న అధికారులు.
⦿ స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామన్న అధికారులు.

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన  కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular