Sunday, June 7, 2026
Homeసినిమాశివ కార్తికేయన్, అనుదీప్ మూవీ ప్రారంభం

శివ కార్తికేయన్, అనుదీప్ మూవీ ప్రారంభం

SK with Anudeep: త‌మిళ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. ‘జాతిర‌త్నాలు’ దర్శకుడు అనుదీప్ కెవి డైరెక్ష‌న్ లో మూవీ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌ల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతోన్న ఈ ద్విభాషా చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.

`జాతి రత్నాలు` బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారిన అనుదీప్, తెలుగులో వరుణ్ డాక్టర్ విజయంతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కోసం అద్శుత‌మైన స్క్రిప్ట్‌ ను సిద్ధం చేశాడు. శివ కార్తికేయన్ కు ల్యాండ్‌మార్క్ గా వుండే ఈ 20వ చిత్రం, SK20 గా ఈరోజు (గురువారం నాడు) లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుండి సినిమా చిత్రీకరణను ప్రారంభించిన‌ట్లుగా మేకర్స్ తెలియజేసారు.

సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుపుకోనుంది  ఈ షూటింగ్ లో నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నారు. SK20 లో విభిన్నమైన కాన్సెప్ట్‌ తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్ర కథ భారతదేశంలోని పాండిచ్చేరి, యుకె లోని లండన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మాతలు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించ‌నున్నారు.

Also Read : శివ కార్తికేయన్ హీరోగా ద్విభాష చిత్రం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular