New Roads – Highways: రాష్ట్రంలో 20 వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న 51 రహదారి ప్రాజెక్టులకు ఈనెల 17న భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం. శంకరనారాయణ వెల్లడించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారని చెప్పారు. మంత్రి శంకరనారాయణ ఢిల్లీలో పర్యటించి గడ్కరీని మర్యాదపూర్వకంగా కలుసుకుని భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించారు.

మంత్రి మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:

  • విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ – భోగాపురం ఎయిర్ పోర్ట్ కు 6 వరుసల రహదారి; కడప – రేణిగుంట రహదారి నిర్మాణం
  • అనంతపురం, చిత్తూరు, ఇతర జిల్లాలో ఉన్న ముఖ్యమైన అంతర్-రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులగా గుర్తించాలని కోరాం
  • రూ.2,200 కోట్లతో అన్ని జిల్లాల్లో రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టనున్నాం. వీటికి నిధులు రాష్ట్రం 30%, మిగతా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సమకూర్చనున్నాయి.
  • ఈ పనులు త్వరిత తగిన పూర్తి చేసేందుకు సకాలంలో సమృద్ధిగా నిధుల విడుదల చేయాలని, టెండర్ల విషయమై చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *