Monday, June 15, 2026
HomeTrending Newsఅంగన్ వాడీల్లో అత్యుత్తమ బోధన: సిఎం జగన్

అంగన్ వాడీల్లో అత్యుత్తమ బోధన: సిఎం జగన్

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు, వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని సూచించారు.  అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని స్పష్టం చేశారు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  అంగన్‌వాడీలలో నాడు – నేడుపై కూడా సిఎం అడిగి తెలుసుకున్నారు. దీనికోసం దాదాపు 1500 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

సమీక్ష సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు…..

  • అంగన్‌వాడీల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలి
  • పనుల్లో నాణ్యత ఉండాలి, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలి
  • ప్రతి మండలంలో కూడా పనులు జరిగేలా మూడు విడతలకూ కార్యాచరణ చేయాలి
  • అంగన్ వాడీల్లో నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలి
  • అలాగే పిల్లలకు ప్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలి, మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ కావాలి
  • ఈ మేరకు షెడ్యూల్‌  రూపొందించుకోవాలి
  • అంగన్‌వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
  • స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలి
  • పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాలి
  • వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలి
  • తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలి
  • ఈ విషయంలో అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్,  వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలి
  • సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా.. అదనంగా ఇవ్వాలి
  • దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేసి, ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలి

  • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో దీనికి పరిష్కారం చూపించాలి
  •  తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానంపై ఆలోచన చేయాలి
  • దీనికోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలి
  • అంగన్‌వాడీలలోలను, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు.
  • ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వారి పట్ల సానుకూల ధృక్పధంతో పనిచేయాలి
  •  10–12  ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చు
  • విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యకార్యక్రమంగా చేపట్టింది

ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కే వి ఉషశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీడెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎ బాబు, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జీ వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, మార్క్‌ ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular