Wednesday, March 26, 2025
HomeTrending Newsసిఎం జగన్ చేతుల మీదుగా అక్షయపాత్ర కిచెన్

సిఎం జగన్ చేతుల మీదుగా అక్షయపాత్ర కిచెన్

Akshaya Patra: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ను సిఎం ప్రారంభించనున్నారు.

11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ చేయనున్నారు.  ఇస్కాన్‌ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్‌ ఇండియా ఆద్వర్యంలో ఈ క్షేత్ర నిర్మాణం జరగనుంది. ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్‌. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ది చేసేలా ఇస్కాన్‌ ప్రణాళికలు రూపొందించింది.

కిచెన్ ప్రారంబోత్సవ ఏర్పాట్లను జిల్లా ఇన్ చార్జ్  మంత్రి శ్రీరంగనాథ రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్