Sunday, June 14, 2026
Homeసినిమా‘సెబాస్టియన్ పిసి524’లో ‘హేలి…’ సాంగ్ విడుదల.

‘సెబాస్టియన్ పిసి524’లో ‘హేలి…’ సాంగ్ విడుదల.

Heli Song: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు, మాసు, యూత్, ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. జ్యోవిత సినిమాస్ పతాకం పై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో  సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ రోజు సినిమాలో ‘హేలి…’ సాంగ్ విడుదల చేశారు.

సినిమాలో హీరోయిన్ నువేక్ష పేరు హేలి. హీరోకి, ఆమెకు మధ్య సాగే ప్రేమ గీతమిది. జిబ్రాన్ సంగీతంలో కపిల్ కపిలాన్ ఆలపించారు. ‘నీ మాట వింటే రాదా మైమరపే… నీ పేరు అంటే రాదా మైమరపే…’ అంటూ సనపాటి భరద్వాజ పాత్రుడు పాటను రాశారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైం డ్యూటీ ఎలా చేశాడు.? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశంగా తెలుస్తోంది.

Also Read : సినిమా పై ఆసక్తి పెంచిన ‘సెబాస్టియన్..’ టీజర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular