Sunday, February 23, 2025
HomeTrending Newsగ్రీన్ కో పవర్ ప్రాజెక్టుకు సిఎం శంఖుస్థాపన

గ్రీన్ కో పవర్ ప్రాజెక్టుకు సిఎం శంఖుస్థాపన

First of its kind: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే,17 (మంగళవారం) నాడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గ్రీన్ కో సంస్థ నిర్మిస్తోన్న ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు సిఎం శంకుస్థాపన చేయనున్నారు.  కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద 5410 మెగావాట్ల సామర్ధ్యంతో ఈ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టును నిర్మించనుంది. దీని ద్వారా సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇలా ఒకే పవర్ ప్రాజెక్టు నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి కావడం దీని ప్రత్యేకత.

ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి గుమ్మటం తండావద్ద నెలకొల్పనున్న ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు(గ్రీన్‌కో)కు చేరుకుని ప్రాజెక్టు పనులకు శంకుస్ధాపన చేస్తారు. నంతరం తిరిగి మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్