RRR tiket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఆ సినిమా యూనిట్ దరఖాస్తు చేసుకుందని, దీనిపై సిఎం జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రవాణా, ఐ అండ్ పీ ఆర్ శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ సినిమా లో హీరోలు, దర్శకుల పారితోషికం కాకుండా, జీఎస్టీ మినహాయించి 336 కోట్ల రూపాయలు ఖర్చయిందని వారు తగిన వివరాలు అందించారని చెప్పారు. ఎఫ్డీసీ, హోం కార్యదర్శి దీన్ని పరిశీలిస్తున్నారని, జీఎస్టీ అధికారుల స్క్రూటినీ తర్వాత సిఎం వద్దకు ఫైల్ వస్తుందని చెప్పారు. ప్రజలకు భారమయ్యే పరిస్థితి లేకుండా, టికెట్ రేట్ ను పెంచుకునేలా వీలు కల్పిస్తామని చెప్పారు.
మొదటి పది రోజులపాటు టికెట్ రెట్లు పెంచుకునే వీలుందని, ఈ విషయాన్ని జీవో 13లోనే స్పష్టంగా పొందుపరిచామన్నారు. సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాతే ఎంత ఖర్చయిండానే విషయం తెలుస్తుందని, ఆ తర్వాతే ఎవరు వంద కోట్ల రూపాయలు పైబడి వ్యాహం చేశారో తెలుస్తుందని మంత్రి చెప్పారు.
ఏపీలో 20శాతం షూటింగ్ నిబంధన ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్రాలకు వర్తించదని, జీవో వచ్చిన తరువాత తీస్తున్న సినిమాలకు వర్తిస్తుందన్నారు. ఆన్ లైన్ టికెట్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు వేశామని రెండు కంపెనీలువచ్చాయని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని, ఏప్రిల్, మే నాటికి ఇది పూర్తవుతుందని చెప్పారు.
Also Read : ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్