Telangana Police Challans :

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కు మంచి  స్పందన వస్తోంది. మార్చ్ 1 నుండి 15 వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్ లు క్లియర్ అయ్యాయి. కరోనా నేపథ్యంలో పోలీసులు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్లకు భారీగా స్పందన వస్తోంది. 15 రోజుల వ్యవధిలో చలాన్ ల రూపంలో 130 కోట్లు ఫైన్ ల రూపంలో చెల్లించిన వాహనదారులు. సాధారణ ఛార్జ్ లతో చూస్తే 600 కోట్ల రూపాయలు ఫైన్ లు విధింపు. చలాన్ కట్టిన వారిలో 80 శాతానికి పైగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని వాహనదారులే కావటం గమనార్హం.

ట్రాఫిక్ నిభందనలు ఉల్లంఘించిన వారికి విధించిన చలాన్ లు చెల్లించేందుకు పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 31 వరకు ఆఫర్ ప్రకటించింది. నిమిషానికి 1000 చలాన్ ల చొప్పున క్లియర్ చేస్కుంటున్నా వాహనదారులు. మొదటి రోజే 5 .5 కోట్ల రూపాయలు ఫైన్ లు రూపంలో పోలీసు శాఖకు ఆదాయం వచ్చింది. డిసెంబర్ 2021 వరకు 80లక్షల పెండింగ్ చలాన్ లు ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *