Cocaine Deaths Argentina : అర్జెంటినాలో కల్తీ కొకెయిన్ వాడి 23 మంది మృత్యువాత పడ్డారు. మరో 84 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వీరందరికీ రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొకెయిన్ లో ఏమి కలిసిందనే అంశంపై నిపుణుల నుంచి వివరాలు అందాల్సి ఉంది. తాజాగా కొకెయిన్ సేవించిన వారు మూర్చ, గుండెపోటుతో చనిపోయారు. దీనిపై ప్రత్యేక బృందం విచారణ జరుపుతోంది. అయితే ఎలుకకు సంబంధించి విష పదార్థాలు కలిశాయని, గత 24 గంటల్లో కొకైన్ కొనుగోలు చేసిన వారంతా వాటిని వాడొద్దని, బయట పడేయాలని అర్జెంటినా ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.
కల్తీ కొకెయిన్ మరణాలు దేశ రాజధాని బ్యునోస్ ఎయిర్స్ లో నిరసన ప్రదర్శనలుగా మొదలయ్యి హిసత్మకంగా మారింది. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో ఆందోళకారులు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు. ప్రభుత్వ నిఘా లేకనే కొకెయిన్ కల్తీ జరిగి మరణాలు సంభవించాయని మృతుల బంధువులు, నిరసనకారులు నినాదాలు చేశారు.
అర్జెంటినాలో కొకెయిన్ వ్యక్తిగత అవసరాల కోసం కలిగి ఉండటం నేరం కాదు. అయితే కొకెయిన్ రవాణా మాత్రం తీవ్ర నేరంగా అర్జెంటినా న్యాయ చట్టాలు పరిగణిస్తాయి. కోకా మొక్కల నుంచే తయారు చేసే కొకెయిన్ అత్యంత వేగంగా మత్తెక్కించే మాదక ద్రవ్యం. అమెరికా, ఉరుగ్వే తర్వాత ప్రపంచంలో ఎక్కువగా కొకెయిన్ అర్జెంటినాలో వినియోగంలో ఉంది. కొకెయిన్ లో మత్తు పెంచేందుకు కొందరు వివిధ రకాల రసాయనాలు వాడుతున్నారని, అదే క్రమంలో అవి విషపూరితం అయిఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అంటున్నాయి.