Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్క్వార్టర్స్ లోకి కోకో గాఫ్

క్వార్టర్స్ లోకి కోకో గాఫ్

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో సంచలనం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కోకో గాఫ్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. 15 ఏళ్ళ తరువాత చిన్న వయసులోనే గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ కు చేరుకున్న క్రీడాకారిణిగా ఖ్యాతి గడించింది. 2006లో చెక్ రిపబ్లిక్ కు చెందిన నికోల్ వైడిసోవా 17 ఏళ్ళ 44రోజుల వయసులో ఈ ఫీట్ సాధించగా ఇప్పుడు కోకో 17 ఏళ్ళ 86 రోజుల వయసులో ఫ్రెంచ్ క్వార్టర్స్ కు చేరుకుంది.

క్వార్టర్స్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన బర్బోరా స్టైకువాతో కోకో తలపడనుంది. ¬1993 లో జెన్నిపర్ కాప్రియాటి తరువాత ఫ్రెంచ్ ఓపెన్ లో క్వార్టర్స్ లో అడుగుపెట్టి అమెరికాకు చెందిన పిన్న వయస్కురాలిగా కూడా కోకో రికార్డుల కెక్కింది.

నాలుగో రౌండ్ లో కోకో టునీషియా కు చెందిన ఒన్స్ జబేయుర్ పై 6-3, 6-1 తేడాతో నెగ్గింది. సింగల్ బ్రేక్ పాయింట్ లేకుండానే కోకో విజయం సాధించడం మరో విశేషం
తొలిసారి గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ కు చేరుకోడవం సంతోషంగా ఉందని, ఈరోజు ఆటతీరు తనకెంతో సంతోషాన్నిచ్చిందని కోకో ఆనందం వ్యక్తం చేసింది.

ఇటీవలే ఇటలీలోని పార్మాలో ముగిసిన డబ్ల్యూటీఏ ఎమిలియా రోమగ్న -2021లో కోకో కోకో గాఫ్ సింగిల్స్, డబుల్స్ లో విజేతగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్