Sunday, February 23, 2025
HomeTrending Newsఏడుగురు లాయర్లకు జడ్జిలుగా అవకాశం

ఏడుగురు లాయర్లకు జడ్జిలుగా అవకాశం

New Judges: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు లాయర్లకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో ఈనెల 29న సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది.

జడ్జిలుగా పదోన్నతి పొందిన వారిలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, తర్లాడ రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వద్దిబోయిన సుజాత ఉన్నారు.

డిసెంబర్ రెండో వారంలో ఇద్దరు జడ్జిలను నియమించారు.

కొత్తగా ఏడుగురి నియామకంతో ప్రధాన న్యాయమూర్తి తో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోన్యాయమూర్తుల సంఖ్య 27కు చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్