తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభానికి సిద్దమైంది. ఆగస్టు 4వ తేదీన దీన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో, ఐకానిక్‌ భవనంగా తీర్చిదిద్దిన ఈ భవనాన్ని బంజారాహిల్స్‌లో రూ.585 కోట్లతో నిర్మించారు.

ఈ కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవ సన్నాహాలకు సంబంధించిన డ్రై రన్‌ను అదనపు సీపీలు డీఎస్‌ చౌహాన్‌, ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, సంయుక్త కమిషనర్లు ఏవీ రంగనాథ్‌, డాక్టర్‌ గజరావు భూపాల్‌, డీసీపీలు జోయల్‌ డేవిస్‌, సునీతారెడ్డితో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. ఆర్‌ అండ్ బీ, జీహెచ్ఎంసీ విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి జులై 31వ తేదీకల్లా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ భవనం ప్రారంభమైన తర్వాత ఆగస్టు రెండో వారంలో నగర పోలీసు కార్యాలయాన్ని అక్కడికి తరలించనున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ప్రజలు కూడా సందర్శించేందుకు వీలుంది. 19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. అయితే ఇందుకోసం ఛార్జీ వసూలు చేయనున్నారు. దీంతో పాటు ఆరో అంతస్తులోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వెళ్లి బయట నుంచే పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ అనుమతి ఇస్తారు.

Also Read : ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *