Sunday, September 22, 2024
HomeTrending Newsఅయోధ్యలో గర్భగుడి పనులకు శ్రీకారం

అయోధ్యలో గర్భగుడి పనులకు శ్రీకారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు (బుధవారం) వైదిక ఆచారాల మధ్య అయోధ్యలో రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ… దేవాలయం నిర్మాణం కోసం 500 ఏళ్ల పోరాటం ముగిసిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. దేవాలయ నిర్మాణ సాధన ఉద్యమంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పాత్రను యోగి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 11 మంది అర్చకులు పూజలు జరిపారు.రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆదిత్యనాథ్ విడుదల చేశారు.

 

గర్భ గుడి శంకుస్థాపన వేడుకలో భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2020 ఫిబ్రవరిలో ప్రారంభించిన తీర్థ క్షేత్రం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 5, 2020న రామజన్మభూమి స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఆలయాన్ని డిసెంబర్ 2023 నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దాదాపు 17,000 రాళ్లను ఆలయ నిర్మాణంలో వినియోగించనున్నారు. 2023 నాటికి గర్భగృహం, 2024 చివరి నాటికి ఆలయ నిర్మాణం, 2025 నాటికి ఆలయ సముదాయంలో ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రామమందిర నిర్మాణం చేపట్టిన ఇంజినీర్లను సీఎం సత్కరించారు.రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహార్‌పూర్‌లోని ఇసుకరాళ్లను ఆలయ ప్రధాన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు.16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థలంలో ఆలయ నిర్మాణానికి 2019లో సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.

Also Read : అయోధ్య దీపోత్సవం ప్రపంచ రికార్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్