Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీకి వచ్చేస్తున్న 'కమిటీ కుర్రోళ్ళు

ఓటీటీకి వచ్చేస్తున్న ‘కమిటీ కుర్రోళ్ళు

ఈ మధ్య కాలంలో పెద్దవిజయాలను సాధిస్తున్న చిన్న సినిమాల సంఖ్య పెరుగుతూ పోతోంది. అలాంటి చిన్న సినిమాల జాబితాలో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఒకటిగా కనిపిస్తోంది. నిహారిక కొణిదెల ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి, యదు వంశీ దర్శకత్వం వహించాడు. నూతన నటీనటులు ఎక్కువగా కనిపించే ఈ సినిమాను, ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు తీసుకుని వచ్చారు. విడుదలకు ముందే బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘ఈటీవీ విన్’ వారు తీసుకున్నారు. ఈ నెల 12వ తేదీన స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టు  అధికారికంగా ప్రకటించారు.  సందీప్ .. సరోజ్ .. యశ్వంత్ .. ఈశ్వర్ .. త్రినాథ్ .. ప్రసాద్  .. రాధ్య .. తేజస్వి .. శ్రావ్య .. విశిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించాడు.

ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ‘పురుషోత్తపల్లి’లో ఈ కథ సాగుతుంది. అక్కడి ప్రజల విశ్వాసం .. ఆచారాలు .. పండుగల ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే రాజకీయాల ప్రభావం కూడా కనిపిస్తుంది. అక్కడి పరిస్థితులు ఆ గ్రామంలోని యువతపై ఎలాంటి  ప్రభావం చూపుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్