Tuesday, May 6, 2025
HomeTrending Newsకేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష

కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష

Common Entrance Examination For Central Universities :

దేశవ్యాప్తంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ సహా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌) నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. ఒక్కో వర్సిటీ విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ ప్రతిపాదన ఈసారి కార్యరూపం దాల్చనుంది. సీయూసెట్‌ను జూన్‌ లేదా జులైలో నిర్వహించాలని భావిస్తున్న ఎన్‌టీఏ.. ఈ నెలలోనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలుగు సహా 13 భాషల్లో ప్రశ్నపత్రం ఉండనుంది.

తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లు, ఉర్దూ విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఏపి యూనివర్సిటీ సహా దేశంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022 – 23) ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాలలోని యూనివర్సిటీలతో పాటు అనంతపురం లోని సెంట్రల్ యూనివర్సిటీ కలిపి 12 విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్