Pawan Vs Ntr: పవన్ వెర్సెస్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ మూవీస్ చేస్తున్నారు. ఇటీవల ఓజీ టీజర్ రిలీజ్ చేస్తే.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కూడా అనూహ్య స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు సినిమాల పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఓజీ యాభై శాతంకు పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఉస్తాద్ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడం వలన షూటింగ్ ఆలస్యం అవుతుంది. సమ్మర్లో ఓజీ లేదా ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లోకి రానుందని టాక్ వచ్చింది.

ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. పవన్, ఎన్టీఆర్ మధ్య పోటీ ఏర్పడక తప్పదని ఇండస్ట్రీలో టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. దీనికి కొరటాల శివ దర్శకతవ్వం వహిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ దేవర పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకముందే ప్రకటించారు. ఇలా వారం, పది రోజుల గ్యాప్ లో వపన్, ఎన్టీఆర్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడక తప్పదని ప్రచారం జరుగుతుంది.

గతంలో పవన్, ఎన్టీఆర్ సినిమాలు పోటీపడ్డాయి. పవన్ బాలు, ఎన్టీఆర్ నా అల్లుడు ఓకే టైమ్ లో రిలీజ్ కాగా, నా అల్లుడు సినిమా ఫ్లాప్ అయ్యింది. బాలు సినిమా ఫరవాలేదు అనిపించింది. రాఖీ, అన్నవరం సినిమాలు పోటీపడగా.. రాఖీ సినిమాకి మంచి పేరు వచ్చింది. గబ్బర్ సింగ్, దమ్ము సినిమాలు కూడా ఓకే టైమ్ లో రిలీజ్ అయ్యాయి. అలాగే అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా సినిమాలు పోటీపడ్డాయి.  ఇప్పుడు పది రోజుల గ్యాప్ లో మళ్లీ పోటీపడబోతున్నారని వార్తలు రావడంతో ఈ రెండు సినిమాల పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. నిజంగానే పవన్, ఎన్టీఆర్ సినిమాల మధ్య పోటీ ఏర్పడతాదేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *