Completely Lockdown In Madurai Arunachalam :
ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వేరియంట్.. ఒమిక్రాన్ కేసులు కూడా రావడంతో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ కూడా విధించాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆదివారం (9వ తేదీ) పూర్తి లాక్ డౌన్ విధించింది. ఇక నుంచి ప్రతీ ఆదివారం లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టంచేసింది.
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై, అరుణాచలం మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు. మధురై, అరుణాచలం మరియు మరికొన్ని ప్రాంతాల దేవస్థానాలు మూడు రోజులపాటు లాక్ డౌన్ విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే అయ్యప్ప భక్తులు డైరెక్ట్ గా శబరిమల దర్శనం చేసుకోవలసిందిగా తమిళనాడు ప్రభుత్వం సూచించింది. సోమవారం వరకు పూర్తిగా లాక్ డౌన్ విధించారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. వాణిజ్య సముదాయాలు, షాపులు, హోటళ్లు మూసివేస్తారు. ఆదివారాలు మాత్రం పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నారు. ఆదివారం లాక్ డౌన్ ఉన్న.. 24 గంటల పాటు పెట్రోల్ బంకు ఓపెన్ ఉంటాయని వివరించాయి. కేసులను బట్టి కర్ఫ్యూ సమయం పొడగించే అవకాశం ఉంటుంది.
Also Read : మూడో వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం..