Monday, February 24, 2025
HomeTrending Newsకర్ణాటకలో అవినీతి రాజ్యం - ప్రియాంక గాంధి

కర్ణాటకలో అవినీతి రాజ్యం – ప్రియాంక గాంధి

కర్ణాటకలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అక్కడి బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా ఫైరయ్యారు. బెంగళూరులో కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాటుచేసిన ఓ సభలో మాట్లాడిన ప్రియాంకాగాంధీ.. కర్ణాటకలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నదని, అవినీతి కారణంగా రాష్ట్రం రూ.1.5 లక్షల కోట్లు నష్టపోయిందని తాను ఇక్కడికి రావడానికి ముందే విన్నానని చెప్పారు.

పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (PSI) రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌ సిగ్గుచేటని, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో మీరు మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆ సభకు వచ్చిన ప్రజలకు ప్రియాంకాగాంధీ సూచించారు. ఐదేండ్ల బీజేపీ పాలనలో మీ జీవితాలేమైనా బాగుపడ్డాయా..?, మీ జీవితంలో ఏదైనా మార్పు జరిగిందా..? అని ప్రశ్నించారు. ఐదేండ్ల క్రితం ఓటు వేయకముందు మీ జీవితం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో.. ప్రతి ఒక్కరూ ఒకసారి తరచి చూసుకోవాలని, అప్పుడే బీజేపీ నిర్లక్ష్యం అర్థమవుతుందని ప్రియాంకాగాంధీ చెప్పారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్