పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఈ రోజు సూరత్ కోర్టులో హాజరయ్యారు. రాహుల్ తన వ్యాఖ్యలపై కోర్టుకు వివరణ ఇచ్చారు. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోడీ ని పదే పదే విమర్శించారని బిజెపి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దేశ సంపద దోచుకుంటున్న నీరవ్ మోడీ, లలిత్ మోడీ దొంగలని ఇదే కోవలో పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని రాహుల్ విమర్శలు చేశారు. ఈ కోవలో మరెంత మంది మోడీలు వస్తారోనని కర్నాటక లోని కోలార్ ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు.
మోడీ ఇంటి పేరు ఉన్నవారు అందరు దొంగలని అర్థం వచ్చేలా రాహుల్ గాంధి ఆరోపణలు చేశారని సూరత్ ఎమ్మెల్యే పుర్నేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో రాహుల్ అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాహుల్ గాంధి వ్యాఖ్యల్ని బిజెపి నేతలు వక్రీకరించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు తప్పుడు ఫిర్యాదు చేశారని గుజరాత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఆర్ధిక నేరగాళ్ళని మోడీ పరిపాలలో విఫలం అయ్యారని రాహుల్ గాంధి వ్యాఖ్యలు చేస్తే బిజెపి నేతలు తప్పుడు భాష్యం చెపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.