Sunday, September 29, 2024
HomeTrending Newsకాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల...తెలంగాణ, కర్ణాటక తరహా గ్యారంటీలు

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల…తెలంగాణ, కర్ణాటక తరహా గ్యారంటీలు

కాంగ్రెస్ మేనిఫెస్టో ”న్యాయ్‌పత్ర’ ను 2024 లోక్‌సభ ఎన్నికల కోసం శుక్రవారం విడుదల చేసింది. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్రనేతలు ఎన్నికల మేనిఫెస్టోను న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు.

కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేసింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందించింది.

మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ పీ చిదంబరం మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు,ఉద్యోగాల కల్పన,సంపద సృష్టి,సంక్షేమ సూత్రాలపై మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. పార్టీ మేనిఫెస్టోలో 5న్యాయ్ లో భాగంగా 25 మీలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోలో రైతు న్యాయం,మహిళా న్యాయం,యువత న్యాయం,కార్మిక న్యాయం,భాగస్వామ్య న్యాయం వంటి 5 న్యాయాలు ఉన్నాయి.

న్యాయసుత్రలో ముఖ్యాంశాలు

కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో మంజూరైన పోస్టుల్లో దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్ మోడల్ గా 25 లక్షల వరకు నగదు రహిత బీమాను స్వీకరించడం జరుగుతుంది.

స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే ఎంఎస్‌పికి చట్టపరమైన హామీలను కాంగ్రెస్ ఇస్తుంది. ప్రతి పౌరుడిలాగే మైనారిటీలకు దుస్తులు, ఆహారం, భాష, వ్యక్తిగత చట్టాల ఎంపిక స్వేచ్ఛ ఉండేలా కాంగ్రెస్ హామీ ఇస్తుంది. వ్యక్తిగత చట్టాల సంస్కరణలను ప్రోత్సహిస్తాం. అటువంటి సంస్కరణ తప్పనిసరిగా సంబంధిత సంఘాల భాగస్వామ్యం,సమ్మతితో చేపడతామని ప్రకటించారు.

కుల గణన నిర్వహించి, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, కార్మికుల ఆరోగ్యంపై హక్కుల కల్పన, రోజుకు కనీస వేతనం రూ.400 గా పట్టణ ఉపాధి హామీ వంటి వాగ్దానాలను కాంగ్రెస్ ఇచ్చింది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్‌లకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తూ నెలకు 1,000కి పెంచుతామని తెలిపింది. పేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం రూ.లక్షతో పాటు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు, ఆశా, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కార్యకర్తలకు అధిక వేతనాల హామీని పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆ పార్టీ నాయకురాలు అల్కా లాంబా మాట్లాడారు. ఇది ‘న్యాయ్ పత్ర’ అని అన్నారు. తలుపులు మూసి ఉన్న గదుల్లో కూర్చొని చేయలేదని, ‘భారత్ జోడో యాత్ర’, భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రజల పరిస్థితిని చూసి రూపొందించిన మేనిఫెస్టో అని పేర్కొన్నారు. 

జైపూర్, హైదరాబాద్‌లలో రేపు జరిగే కాంగ్రెస్ బహిరంగ సభల్లో మేనిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ప్రజలకు వివరించనున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్